Skip to main content

Posts

GEETA MARCHINA RATHA - గీత మార్చిన రాత

నగరానికి దూరంగా కొండ మీద ఒక అందమయిన ఇల్లు. అత్యంత ఆధునిక సౌకర్యాలు, అధునాతన భద్రతా వ్యవస్థ కలిగిన ఇల్లు అది. పైకి సైనిక స్థావరంలా కట్టుదిట్టంగా కనిపించినా లోపల ఇంటీరియర్ డెకొరేషన్ మాత్రం వేరే లోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగించక మానదు. ఆ ఇంట్లో కొండ అంచున ఉన్న ప్రత్యేకమయిన అద్దాల గది మన  ఈశ్వర్  పర్సనల్ వర్క్ స్పేస్ .  ఇంతకీ ఈశ్వర్ ఎవరో చెప్పలేదు కదూ!!! ఈయనే మన కధలో హీరో. ఊహ తెలియని వయసులో అనుకోని దుర్ఘటన వల్ల రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన ఈశ్వర్, కొందరి సహాయంతో తనకి ఊహ తెలిసేవరకు అనాధాశ్రమంలో ఉన్నాడు. దిక్కులేనివారికి దేవుడే దిక్కు అన్నట్లు రామకృష్ణ అనే స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈశ్వర్ ని దత్తత తీసుకుని విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రతి ఒక్కరికి వృత్తి, ప్రవృత్తి అని రెండు ఉంటాయి ... ఒకటి పూట గడవడానికి, రెండోది మనసు నడవడానికి, మన మాస్టర్ గారికి చిత్రలేఖనం అంటే మిక్కిలి మక్కువ. ఆ మక్కువతో ఆ వయసులో గోవింద్ అనే ఆర్టిస్ట్ దగ్గర పాఠాలు నేర్చుకునేందుకు తనతోపాటు ఈశ్వర్ ని కూడా వెంటతీసుకుపోయేవారు. వయసులో చిన్నవాడయినా చెప్పిన ప్రతీ విషయాన్ని, నేర్పిన ప్రతీ అంశాన్ని ఎంతో శ్రద్ధతో విని
Recent posts

SANDHYA KIRANAM - సంధ్యాకిరణం

ఇది  "ఉష లేని కిరణం కధ - రెండవ భాగం",  ముందుగా మొదటి భాగం చదివిన తరువాత ఈ రెండవ భాగం చదవమని పాఠకులకి మనవి. ఉషలేని కిరణం      పై క్లిక్ చేసి మొదటి భాగాన్ని చేరుకోండి  ............................. దూరంగా వెలుగుతున్న బాణసంచా వెలుగులు, పెద్దగా మొగుతున్న బాజాబజంత్రీల మోతకి ముహూర్త సమయం దాటిపోయింది, ఉష మరొకరి అర్ధాంగి అయ్యింది అని కిరణ్ కి అర్ధం అయ్యింది. ఎంత ఆపుకున్నా దుఃఖం తన్నుకొస్తోంది, తెరలు తెరలుగా ఉష జ్ఞాపకాల అలలు తన మనసుని తాకుతుంటే తట్టుకోవడం తనవల్ల కాలేదు, వెక్కివెక్కి ఏడుస్తూ, తనలోతానే మాట్లాడుకుంటూ, తనకి తానే సర్దిచెప్పుకుంటూ ఎప్పుడు జారుకున్నాడో తెలియదు కానీ నిద్రలోకి జారుకున్నాడు, కలలో కూడా వీడకుండా ఉష తలపులే. గతంలో శ్రీరామనవమి సందర్భంగా ఉష రాములవారి గుడి సేవలో ఉండగా కిరణ్ గుడిలోనే ఒక పక్కగా నిద్రలోకి జారుకున్నాడు, అప్పుడు ఉష వచ్చి ముఖం మీద నీళ్లు చిలకరించడంతో నిద్రలోనుండి మేలుకున్నాడు, ఈ క్షణం కూడా ముఖం మీద నీటి చుక్కలు చిలకరించినట్లు పడుతుండడంతో తనేనేమో అని ఆశగా కళ్ళు తెరిచాడు, లేచి కూర్చుని అటు ఇటు చూసాడు. తల పైకెత్తేసరికి బుగ్గ మీద పడ్డ వాన చినుకు కన్నీటితో

USHA LENI KIRANAM - ఉష లేని కిరణం

కిరణ్, ఒక మామూలు మధ్యతరగతి కుర్రాడు ... కష్టించి పని చేసే మనస్తత్వం గలవాడు, నిఘర్వి. అందరిలాగే తనకి కూడ జీవితం మీద ఆశలు , చేరుకోవాల్సిన లక్ష్యాలు, నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయ్. సగటు మనిషిలాగే రేపటి మీద ఆశతో, ఆ ఆశని చేరుకోడానికి ఇవాళ నుండే ఏం చేయాలి అనే స్పష్టత ఉన్న కుర్రాడు. ఉష, శాస్త్రి గారి అమ్మాయి ... మన కిరణ్ ప్రేమించిన పిల్ల ... ఎంతో చలాకీ, చదువుల్లో మేటి, ఆచారవ్యవహారాలన్నా, పెద్దలన్నా గౌరవం ... ప్రతీ ఇంటా సాధారణంగా తండ్రి దగ్గర కన్నా తల్లి దగ్గరే పిల్లలకి చనువు ఎక్కువ, ఉషకి అమ్మ దగ్గర తాను ఆడిందే ఆట, పాడిందే పాట.... కానీ తండ్రి వచ్చే సమయానికి మాత్రం ముక్కున వేలు వేసుకుని కూర్చుంటుంది. అంత భయం, గౌరవం తండ్రి అంటే. ఎంత పెరిగి పెద్దవాళ్లయినా కూడా తల్లితండ్రుల మనసులలో పిల్లలు ఎప్పుడూ చిన్న పిల్లలే. ఉషాకిరణ్ లకు ఒకరంటే ఒకరికి అమితమయిన ప్రేమ, ఇద్దరూ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారంటే తనువులు రెండే కానీ మనసు ఒకటే అన్నట్లుగా. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో మీరు తెలుసుకోవాలి! ఒకసారి కళాశాల తరపున తుఫాన్ బాధితుల సహాయనిధి కోసం డబ్బులు, వస్తువులు సేకరించే పనిలో కిరణ్ వాళ్ళ ఇంటి